Friday, June 17, 2011

Updates About Tarakratna’s Next Movie “Prajapathi”


శ్రీ సాంబశివ క్రియేషన్స్ పతాకం పై యలమంచి రవిచంద్ నిర్మిస్తున్న ప్రజాపతి మూవీ కి చక్రిని సంగీత దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. ఇంతవరకూ ఇలాంటి బాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాకి చక్రి సంగీతం ఇవ్వలేదు. సో ప్రేక్షకులు ఈ సినిమా ద్వార చక్రి నుంచి విభిన్నమైన సంగీతాన్ని ఆసించ వచ్చు.

రాజా చంద్రవర్మ.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రం లో నందమూరి తారక రత్న మహా శివుడి భక్తుడిగా.. కనిపించ బోతున్నారు. ధర్మ పరి రక్షణలో, జన సంరక్షణలో మడమ తిప్పని వారసుడిగా జనం కోసం బ్రతికే నాయకుడి పాత్రలో తారక రత్న విభిన్నంగా కనిపించబోతున్నారు. మహాదేవుడి భక్తుడిగా జనం తో మమేకమై..జనం కోసం నడిచిన నాయకుడిగా తారక రత్న సరికొత గెటప్ లో కనిపించబోతున్నారు. ఇచిన మాటకోసం తల తీసి ఇవ్వగల వంశానికి వారసుడిగా తారక రత్న పాత్ర అద్భుతంగా ఉంటుంది.జనానికి బ్రతుకునిచ్చి,భద్రత నిచ్చి, భారోసనిచ్చే నాయకుడు ప్రజాపతి పాత్రలో లీనమవడానికి తారక రత్న ఇప్పటినుంచే అన్ని రకాలుగ సిద్ధపడుతున్నారు. ఒక వైపు గెటప్ టెస్ట్ లు జరుగుతున్నాయి. ఇంకో వైపు వీడియో లో షూట్ చేసి అందుకు అనుగుణంగా తన బాడీ ని జిమ్ లో జాయిన్ అయి మెరుగు పరచుకుంటున్నారు. ముక్కంటి భక్తుడిగా.. జన నేతగా తారక రత్న చెయ్యనున్న విభిన్నమైన పాత్రలు నందమూరి అభిమానులకు కనువిందు చేయ్యనున్నాయి.

Source : Raja Chandra Varma, Director

No comments:

Post a Comment